సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘కాంగ్రా’ ఇప్పుడు ‘ఆప్’, ‘బిజెపి’ల మధ్య ఎన్నికల పోరుభూమిగా మారింది. అక్కడ బిజెపి నాయకుడు నడ్డా ప్రచారం తర్వాత, కేజ్రీవాల్ తన రోడ్ షో నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితికి కారణం కాంగ్రెస్, బిజెపి పాలకులేనని ఆయన విమర్శించారు. కనీసం విద్యుత్ కూడా సరిగా అందడంలేదన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో నేడున్న సమస్యలన్నింటికీ ఆ రెండు పార్టీలే కారణమని కూడా ఆయన విమర్శించారు. ‘కానీ ఆ రెండు పార్టీలు కేజ్రీవాల్ ఇలా.. కేజ్రీవాల్ అలా…అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ వెనుబడి ఉండడానికి నా ప్రమేయం ఏముంది? హిమాచల్‌ప్రదేశ్‌ను దెబ్బతీసిన ఆ రెండు పార్టీలే నేడు కేజ్రీవాల్‌ను ఇలా..అలా…అంటూ విమర్శిస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు.
"BJP and Congress have looted #HimachalPradesh": Delhi Chief Minister @ArvindKejriwal in #Kangra pic.twitter.com/1gcTU5qZGP
— NDTV (@ndtv) April 23, 2022