Wednesday, January 1, 2025

హనుమాన్ చాలీసా వివాదం: వెనక్కి తగ్గిన ఎంఎల్ఏ రవి రాణా

- Advertisement -
- Advertisement -

Ravi Rana

ముంబయి: మహారాష్ట్ర ఎంఎల్ఏ రవి రాణా – ముంబైలోని ‘హనుమాన్ చాలీసా’ వివాదంలో కేంద్ర బిందువయ్యారు.   రాష్ట్రాన్ని విస్మరించి ‘హిట్లర్ షాహీ’ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని ఆయన విమర్శించారు. కాగా మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న కారణంగా తన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

“మా లక్ష్యం నెరవేరింది.  రవి రాణా, నేను(నవనీత్ కౌర్) ‘మాతోశ్రీ’ (థాక్రే ముంబై నివాసం) చేరుకోలేకపోయాము.  మేము పఠించాల్సిన  ‘హనుమాన్ చాలీసా’ భక్తులే జపించారు” అని రవి రానా భార్య నవనీత్ కౌర్ రాణా(లోక్ సభలో స్వతంత్ర ఎంపీ) అన్నారు. “శివసేన గూండాల పార్టీగా మారింది. ఉద్ధవ్ థాక్రేకు వ్యక్తులపై నేరాలను మోపడం, వారిని కటకటాల వెనక్కి నెట్టడం మాత్రమే తెలుసు. అతను మహారాష్ట్రలో బెంగాల్ లాంటి పరిస్థితిని సృష్టిస్తున్నాడు” అని ఆమె చెప్పుకొచ్చారు.

రవి రాణా, స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఉదయం 9 గంటలకు ‘మాతోశ్రీ’ ముందు ‘హనుమాన్ చాలీసా’ పఠిస్తారని చెప్పారు.

తాజా వార్త ప్రకారం వారిని  పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News