Monday, December 23, 2024

హార్ట్‌కు టచ్ అయ్యే సినిమా

- Advertisement -
- Advertisement -

హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన 91వ సినిమా ‘శేఖర్’. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి శేఖర్ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. అనంతరం చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ “రాజశేఖర్ డిఫరెంట్ గెటప్‌తో ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ‘శేఖర్’ సినిమా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ సినిమాకు ఎంతో ప్రాణం పెట్టి పని చేశారు”అని తెలిపారు.

దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ “ప్రతి ఒక్కరి హార్ట్‌కు టచ్ అయ్యే సినిమా ‘శేఖర్’. కోవిడ్ తరువాత ప్రతి ఒక్క ఫ్యామిలీ బాధపడడం ఇందులో చూస్తారు. ప్రేక్షకులు ఎప్పుడు ఎమోషన్ ఫిలిమ్స్ ఆదరిస్తూ వస్తున్నారు. గోరింటాకు, అక్కమొగుడు, మా అన్నయ్య, సింహారాశి దగ్గరి నుంచి రాజశేఖర్ చాలా సినిమాలను ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాలకంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో శివాని నటించింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా సెంటిమెంటల్‌గా ఉంటాయి”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాందాస్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News