- Advertisement -
ముంబయి : ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెరుగుదల గరిష్ఠంగా 1.1 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది. కొత్త ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలు, ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని వినియోగదారులపై కి బదిలీ చేయక తప్పడం లేదని తెలిపింది. ఇటీవల మారుతి సుజుకి, బిఎండబ్లు వంటి పలు సంస్థలు కూడా తమ కార్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. సెమీ కండక్టర్ల కొరతతో పాటు పలు కీలక లోహాలు అందుబాటులో లేకపోవడం వాహన పరిశ్రమకు గత కొంత కాలంగా సవాలు విసురుతున్నాయి.
- Advertisement -