- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 16 వేలకు చేరువయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం శనివారం 4,32,532 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 2593 కేసులు బయటపడ్డాయి. శనివారం కరోనాతో 44 మంది మృతి చెందగా, ఇప్పటివరకు మృతులైన వారి సంఖ్య 5,22,193 కు చేరింది. శనివారం 1755 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు (98.75 శాతం) దాటింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు పెరిగి 15,873 (0.04 శాతం)కు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో శనివారం 19,05,374 మంది టీకాలు వేయించుకోగా, ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 187.67 కోట్లు దాటింది.
- Advertisement -