నిబంధనలు సవరించిన అధికారులు
హైదరాబాద్: విద్యుత్‌శాఖలో పేరు మార్పిడి,యాజమాన్యం, టైటిల్ బదిలీలను సులభతరం చేశారు. గతంలతో ఒక వినియోగదారుడు పేరు మారాలంటే సవాలక్ష కారణాలతో ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. కేవలం పేరు మార్పు కోసమే 9 రకాల డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉండేది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడటమే కాకుండా చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపిస్తూ విద్యుత్‌శాఖ సిబ్బంది కూడా తమదైన పద్దతిలో చేతివాటం ప్రదర్శించేవారు. అడిగింది ఇవ్వక పోతే అనేక సమస్యలు సృష్టించే వారు వారం రోజులు, నెలల తరబడి కూడా పేరు మార్పిడి కోసం సదరు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ అంశంపై అనేక ఫిర్యాదులు కూడా రావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నిబంధనలు సవరిస్తూ సీఎండి రఘుమారెడ్డి ఆదేశాలు కూడా జారీ చేయడంతో గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. గ్రేటర్ పరిధిలో ఇళ్ళు, పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు, భూములు ఖరీదు చేయడం సర్వసాధారణ విషయం.
అయితే అప్పటి వాటికి విద్యుత్ వెలుగు నింపేందుకు ఉన్న విద్యుత్ కనెక్షన్ పేరు( యాజమాన్యం పేరు మార్చడం) అవసరం. అయితే వీటిని మార్చాలంటే అధికారులకు 9 రకాల డాక్యుమెంట్స్ ఫోటో ఐడీ, సేల్‌డీడ్, లోకేషన్ ఫోటో, లింక్ డాక్యుమెంట్లు, డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు, ఈసీ, రూ.100 విలువ గల ఇండెన్మిటీ బాండ్, ఎన్‌వోసీ ( పాత వినియోదారునిది) సమర్పించాల్సి వచ్చేది. అయితే వీటిలో మూడు రకాల డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుందని విద్యుత్‌శాఖ యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పిడి కోసం సేల్‌డీడ్‌కాపీ, గుర్తింపు కార్డు ప్రూఫ్, భవిష్యత్తులో ఎవైనా కేసులు వస్తే ఎదుర్కొనేందుకు సదరు వ్యక్తి ద్వారా ఇండెన్మిటీ బాండ్ రూ.100 విలువ గలది సమర్పిస్తే పరిసోతుంది. ఒక ఆస్తికి సంబంధించి పేరు మారినప్పుడు సేల్‌డీడ్ ఉంటుంది. కావునా దాని నకులుతో పాటు ఐడీ ప్రూఫ్, స్వంత పూజికత్తు రూ.100 ఇండెన్మిటీబాండ్ సమర్పిస్తే చాలని విద్యుత్ శాఖ అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపారు.