‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్సి కాటన్ కళా పరిషత్ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో అని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. వచ్చే ఏడాది రావులపాలెంలోని సీఆర్సి నాటక కళా పరిషత్ 23వ ఉగాది నాటకోత్సవాలలో జరగబోయే నాటక పోటీల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు సీఆర్సి గౌరవాధ్యక్షులు తనికెళ్ల భరణి. ఈ సమావేశంలో సీఆర్సి పరిషత్ కన్వీనర్ విక్టరీ వెంకటరెడ్డి, సీఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్‌రెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, చిన్నం తేజారెడ్డి, కోట శంకర్రావు, నటుడు గౌతంరాజు, గుండు సుదర్శన్, త్రిమూర్తులు పాల్గొని నాటక పోటీల గురించి వివరించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ-… తొలి ఉత్తమ ప్రదర్శనకు మూడు లక్షల రూపాయలు, రెండో ఉత్తమ నాటకానికి రెండు లక్షల రూపాయలు, మూడో ఉత్తమ బహుమతికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించి ఇది భారతదేశంలోనే నాటక కళాకారులకిచ్చే పెద్ద మొత్తమని అన్నారు. ప్రపంచంలోని నలుమూలలా ఉండే నాటక ప్రియులంతా ఈ నాటకాల్లో పాల్గొనటానికి అర్హులని ప్రకటించారు అని చెప్పారు.