- Advertisement -
హైదరాబాద్ : మెట్రో ట్రైన్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అప్పులబాధ భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గోల్నాకలో నివసించే తుంకి ప్రేమ్ రాజ్ కుమారుడు సందీప్ రాజ్ నాగోలులో మెట్రో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం అప్పులబాధతో సతమతమవుతోంది. శనివారం సాయంత్రం అతను తల్లికి ఫోన్ చేసి తాను ఈ రోజు మియాపూర్ డిపోలో నిద్రిస్తానని, ఇంటికి రానని చెప్పాడు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువులో సందీప్ రాజ్ మృతదేహం కనిపించింది. శనివారం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితుడు వెంకటేష్ కు సందీప్ రాజ్ వాట్సాప్ మెసేజ్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -