మన తెలంగాణ/సిటీ బ్యూరో: నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండగను నిరుపేద ముస్లీం సోదరి సోదరులు సంతోషంగా జరుపునునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని జిహెచ్‌ఎంసిమేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రంజాన్ పండగను పురస్కరించుకుని నగరంలో పలు ప్రాంతాల్లో మేయర్ తోఫాలను పంపిణీ చేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో కలిసి మేయర్ అంబర్‌పేట్‌లో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్ని మతాలను పండగలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ గౌరవిస్తున్నరన్నారు. నిరుపేదలు పండగలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలన్నదే సిఎం ఉద్దేశ్యం అన్నారు. జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో మేయర్ రంజాన్ తోఫాలను అందజేశారు.
అన్ని మతాల పండుగలకు సమాన గౌరవం: మేయర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -