మన తెలంగాణ /సిటీ బ్యూరో: గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థుల కోసం స్విమ్మింగ్ పూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ను సోమవారం ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్, స్వీమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల, పాఠశాల ఛైర్మన్ మల్క కొమరయ్య, సిఒఒ మల్క యశస్వి, విఐఎఫ్ ఎడ్యుకేషన్ సోసైటీ జాయింట్ సెక్రటరీ జోహార్ ఆరిఫ్, పాఠశాల ప్రిన్సిపల్ మిథాలీ అర్చిట్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యామల గోలి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీమన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మీథాలి ఆర్చిట్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు తరగతి గదులు, లైబ్రరీలు, క్రీడా మైదనాలు మొదల్కొని ఉత్తమమైన మౌలిక సదుపాయాలను అందించడానికి పాఠశాల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చెప్పారు. స్విమ్మింగ్ కోచ్ ప్రణీత్ ఆధర్యంలో విద్యార్థులకు స్వీమ్మింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల తొలి బ్యాచ్ కొత్త స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేసింది.
గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్విమ్మింగ్ పూల్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -