రెండు బైక్‌లు స్వాధీనం
మనతెలంగాణ, సిటిబ్యూరో: పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న పాత నేరస్థుడుని గోపాలపురం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని అంబర్‌పేటకు చెందిన పిన్నోజి జగదీష్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు ఇప్పటి వరకు ముషీరాబాద్, నల్లకుంట, చిలకలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేయడంతో పోలీసులు 11 కేసులు నమోదు చేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన గోరక్ వేణుగోపాల్ ఈ నెల 24వ తేదీన కీస్ హైస్కూల్ ఎదుట తన బైక్‌ను పార్కింగ్ చేసి పాఠశాలలోకి వెళ్లి వచ్చే సరికి కన్పించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా పాత నేరస్థుడు చోరీ చేసినట్లు గుర్తించారు. వెంటనే గోపాలపురం క్రైం నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. గతంలో తాను చేసిన నేరాలను మొత్తం నిందితుడు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ కోటయ్య, డిఐ పాండు రాజు, ఎస్సైలు తదితరులు పట్టుకున్నారు.