- Advertisement -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ, మిల్లీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే జాన్వీ తాజాగా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో వెల్లడించింది. శ్రీదేవి మరణం తర్వాత బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్, కూతురు అన్షులా… జాన్వీ, ఖుషీకపూర్‌లకు దగ్గరయ్యారు. ఈ విషయం గురించి జాన్వీ మాట్లాడుతూ “అమ్మ మరణించిన తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా అక్క మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము ధైర్యవంతులమయ్యాం. ఖుషీకి, నాకూ ఇద్దరు తోబుట్టువులు దొరికారు. మేము ఎంతో అదృష్టవంతులం”అని అన్నారు.
Janhvi Kapoor about Siblings Arjun Kapoor and Anshula
- Advertisement -