- Advertisement -
మన తెలంగాణ /కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడు గ్రామానికి చెందిన ప్రభుదాస్ ఆనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దుర్శేడు ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు ఆధ్యర్యంలో మంత్రి గంగుల కమలాకర్ సహాయంతో దరఖాస్తు చేసుకొగా 60వేల సిఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజురయింది. కాగా మంగళవారం భాధితునికి సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావులు చెక్కును అందజేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, అంజయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -