Saturday, November 9, 2024

బిగించిన పిడికిలి.. ఉద్యమాన్ని రగలించిన ధీశాలి కెసిఆర్: కవిత

- Advertisement -
- Advertisement -

KCR movement for telangana

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 ఏండ్లవుతున్న సందర్బంగా బుధవారం ఆ పార్టీ గ్రాండ్‌గా ప్లీనరీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు కెసిఆర్ మాటలను గుర్తు చేస్తూ ఓ వీడియో ట్వీట్ చేశారు. నాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసేలా.. 21 వసంతాల పండుగ వేళ ఆమె ట్విట్టర్‌ో్ల పోస్ట్ పెట్టారు. “ప్రాణాలు అడ్డుపెట్టయినా సరే.. ఎన్ని త్యాగాలకు సిద్ధమై అయినా సరే.. గోదావరి జలాలను కాపాడుకుంటాం అని ఉద్యమంలో కేసీఆర్ చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోకు, కాళేశ్వరం ప్రాజెక్టు వీడియోను జత చేసి ఈ ట్వీట్ చేశారు. దానిని “బిగించిన పిడికిలి.. ఉద్యమాన్ని రగిలించిన ధీశాలి.. రాష్ట్ర సాధన కోసం దేశాన్ని కదిలించి గమ్యాన్ని ముద్దాడి, తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న ఆధునిక గాంధీ మన కెసిఆర్ గారు.. నాడు నేడు తెలంగాణకు టిఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని కవిత క్యాప్షన్ పెట్టారు. నేడు మన గులాబీ పండుగ.. మన తెలంగాణ ప్రజల పండుగ.. 21 వసంతాల జెండా పండుగ.. మన కెసిఆర్ గులాబీ జెండా!! తెలంగాణ ప్రజలకు కొండంత అండ !! జై తెలంగాణ !! జై కెసిఆర్ !! అంటూ మరో ట్వీట్ చేశారు కవిత. తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి పోరాడిన రోజుల ఫొటోలతో పాటు తెలంగాణ సాకారమయ్యాక నిర్వహించిన ర్యాలీ ఫొటోలను ఆమె తన ట్విట్టర్ పోస్టులో జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News