Monday, December 23, 2024

నేడే ఆవిర్భావ వేడుక

- Advertisement -
- Advertisement -

దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్న
టిఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో
జరగనున్న సభా వేదిక నుంచి 11
తీర్మానాలు ఆమోదించనున్న పార్టీ
ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ
స్థాయిలో పోషించనున్న పాత్ర..
భవిష్యత్ రాజకీయాల్లో
అనుసరించాల్సిన వ్యూహాలపై
తీర్మానం ఉదయం 11నుంచి
సాయంత్రం 5గం. వరకు
జరగనున్న ప్రతినిధుల సభ
11 గంటలకు సిఎం రాక,
పతాకావిష్కరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పేలా టిఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ సభ బుధవారం నగరంలోని హెచ్‌ఐసిసి ప్రాంగణంలో జరగనుంది. మొత్తం 11 తీ ర్మాలను సభ ఆమోదించనుంది. ఈ సభ నుంచే జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రా వు పోషించాల్సిన పాత్ర…భవిష్యత్ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలకు చెందిన ప్రతినిధుల సభ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతోంది. దీనిపై సభ ఏకగ్రీవంగా ఆమోదించనుంది. అలాగే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం పై కేంద్రం అనుసరిస్తున్న విధానానికి సంబంధించిన ముఖమైన తీర్మానాన్ని కూడా ప్రవేశపెడుతోంది. ఇక కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిన మతోన్మాదం కూడా సభలో చర్చించిన మీదట ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల కారణంగా దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు, మహిళా రిజర్వేషన్లు, బిసి కులగణన, కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్‌టి పన్నుల బకాయిలు తదతర అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతినిధుల సభ జరగనుంది. కాగా సభా ప్రాంగణానికి సిఎం కెసిఆర్ పదకొండ చేరుకుంటారు.

అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తదనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ కె. కేశవరావు ప్రతినిధులను ఆహ్వానిస్తూ ప్రసంగం చేస్తారు. సభకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రారంభోన్యాసం చేస్తారు. అనంతరం తీర్మానాలను ప్రవేశపెట్టి….తదనంతరం వాటికి ఆమోదం తెలుపుతారు. సాయంత్రం ముగింపు సభను ఉద్దేశించి మరోసారి సిఎం కెసిఆర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలోనే జాతీయ స్థాయిలో టిఆర్‌ఎస్ పోషించే పాత్ర కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా ఈ సభకు మూడువేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. కాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ పతాకాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆవిష్కరిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News