- Advertisement -
మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో డ్రైవర్ కేబిన్ లో ఇరుక్కుని మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఓవర్ స్వీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
- Advertisement -