Monday, December 23, 2024

రూ.1 లక్ష ఇంటి పన్ను చెల్లింపు

- Advertisement -
- Advertisement -

House tax paid by SI

మన తెలంగాణ/రాయికల్‌: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను రూ.1లక్ష 19వేల424లను రాయికల్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ బుధవారం మున్సిపల్ సిబ్బందికి చెల్లించారు. పోలీస్‌స్టేషన్‌తో పాటు స్టేషన్ ఆవరణలో ఉన్న క్వార్టర్స్‌ల పెండింగ్ బిల్లులను ఎస్‌ఐ చెల్లించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ బిల్లులను క్లీయర్ చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్‌కుమార్ మాట్లాడారు. ఇంటి యాజమానులు 5శాతం రాయితీతో 2022-23 ఆర్థిక సంవత్సర ఇంటి పన్ను బిల్లులను చెల్లించాలని కోరారు. ఆయా వార్డుల్లో సిబ్బంది ప్రాపర్టీ టాక్స్ వసూళ్లకు వస్తున్నారని వారికి సహకరించాలని కోరారు. మరో మూడు రోజుల్లో రాయితీ గడువు ముగియనున్నదని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News