స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి సినిమా తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తుందని… లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌ను దక్కించుకుంటుందని అంతా భావిస్తే అనుష్క మాత్రం నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆమె నుండి భాగమతి, నిశ్శబ్దం సినిమాలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం అనుష్క ఆచి తూచి సినిమాను ఎంపిక చేసుకుంటోంది.
కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్లు అదుగో ఇదుగో అంటూ ఆలస్యం చేస్తుందోట. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో పి.మహేష్ దర్శకత్వంలో ఒక సినిమాకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా గత ఏడాదిలోనే పట్టాలెక్కాల్సి ఉంది. కానీ అనుష్క సరిగా సమయం కేటాయించని కారణంగా ఆలస్యమవుతూ వస్తోందట. ఎట్టకేలకు వచ్చే నెల నుండి సినిమా షూటింగ్‌లో చేరేందుకు అనుష్క ఓకే చెప్పిందని సమాచారం. ఇదే సమయంలో సినిమాలోని ఆమె పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అనుష్క అంతర్జాతీయ స్థాయి చెఫ్‌గా కనిపించబోతుందట. ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు అనుష్కని చూడని విధంగా చూస్తారంటూ మేకర్స్ చెబుతున్నారు. సినిమాలో ‘జాతిరత్నం’ హీరో నవీన్ పొలిశెట్టి ఉండటం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరుగుతోంది.