Monday, January 20, 2025

ముంబయి హైవేలో 89 కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

Swords catche

ముంబయి: మహారాష్ట్ర పోలీసులు గురువారం ఉదయం ధూలే వద్ద స్కార్పియో వాహనాన్ని పట్టుకుని, అందులో నుంచి దాదాపు 90 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వారు ముంబయిఆగ్ర హైవేలో ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నలుగురిని కూడా అరెస్టు చేశారు. ఆ వాహనం రాజస్థాన్‌లోని ఛిత్తోడ్‌గఢ్ నుంచి వచ్చింది. కాగా ఈ ఘటన రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. ఎందుకంటే కత్తులతో వచ్చిన ఆ వాహనం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి ముంబయికి వచ్చింది. సోన్‌గిర్ గ్రామంలో స్కార్పియో వాహనం నుంచి ఆ కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ధూలే పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆ కత్తులను ఎక్కడికి ఎందుకు తీసుకెళుతున్నారనేదానిపై స్పష్టతలేదు. కాగా 89 కత్తులు, ఒక చురకత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నలుగురిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరచి కస్టడీని కోరనున్నారు. ఇదిలావుండగా నిందితులు తాము జాల్నాకు చెందిన వారమని, వాటిని అమ్మడానికి తెస్తున్నామని తెలిపినట్లు స్థానిక సోన్‌గిర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News