పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్నారాయన. సెర్జీలోని ఓ పండ్ల మార్కెట్‌కు వెళ్లారు. దాంతో ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆ జనాల గుంపులోంచి ఓ వ్యక్తి మెక్రాన్‌పై టమోటా విసిరాడు. అది అధ్యక్షుడికి కొద్దిలో తప్పిపోయింది. దాంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మెక్రాన్ చుట్టు రక్షణ వలయంగా ఏర్పడడంతో పాటు ఓ గొడుగుతో ఆయనను కవర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అధ్యకుడిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఈ వీడియోకు 1.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఇటీవలే మెక్రాన్ తన ప్రత్యర్థి మరీన్ లీ పెన్‌పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Emmanuel Macron ciblé par un jet de tomates lors de son déplacement à Cergy pic.twitter.com/3J0hXIZSRP
— BFMTV (@BFMTV) April 27, 2022