లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ టీమ్ కొత్త కె ప్టెన్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను నియమించారు. ఇటీవలే జో రూట్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో రూట్ స్థానంలో స్టోక్స్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ క్రికెట్‌లోనే స్టోక్స్ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పే రు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో అతనికే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావించింది. మూడు ఫార్మాట్‌లలోనూ స్టోక్స్ నిలకడైన ఆటతో అలరిస్తున్నాడు. బ్యాట్ తో బంతితో అతను అసాధారణ రీతిలో చెలరేగిపోతున్నాడు. ఇటీవల కాలంగా టెస్టుల్లో వరు స ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌ను మళ్లీ విజయపథంలో నడిపించే సత్తా స్టోక్స్‌కు ఉందని ఇంగ్లండ్ క్రికెట్ పెద్దలు ధీ మాను వ్యక్తం చేస్తున్నాడు. రానున్న సిరీస్‌లలో స్టోక్స్ జట్టుకు మళ్లీ పూర్వవైభవం తెస్తాడనే నమ్మకంతో వారున్నారు. ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన బోర్డు పెద్దలకు స్టోక్స్ కృతజ్ఞతలు తెలిపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి జట్టును మళ్లీ గాడిలో పెడతాననే నమ్మకాన్ని స్టోక్స్ వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -