- Advertisement -
లక్నో: పెళ్లి కూతురిని ఆమె లవర్ తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా ప్రాంతం మథురాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాజల్ అనే యువతి అనీష్ యువకుడు ప్రేమించుకున్నారు. కాజల్ పెళ్లి మరో వ్యక్తితో నిశ్చయమైంది. దీంతో ఆమె పెళ్లి కుమార్తెగా ముస్తాబవుతుండగా ఇంట్లోకి వెళ్లి కాజల్‌పై అనీష్ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. కాజల్ తండ్రి ఖుబిరామ్ ప్రజాపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడ్ని పట్టుకున్నారు.
- Advertisement -