- Advertisement -
సంగారెడ్డి: జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని పరిశ్రమలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన పరిశ్రమలో డ్రమ్ములు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రరిశ్రమలోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. పారిశ్రామికవాడలో భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు ఆందోళన పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -