Sunday, November 24, 2024

‘మోడీ హై, ముమ్‌కిన్ హై’: చిదంబరం ఎగతాళి!

- Advertisement -
- Advertisement -

Chidamberam

న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు చోటుచేసుకుంటుండంతో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కేంద్రాన్ని విమర్శించారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు శుక్రవారం ఎక్కువయ్యాయి. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత కారణం కావడంతో కేంద్రాన్ని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. చిదంబరం ఈ విషయంపై ఇంకా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ “ కావలసినంత బొగ్గు, రైల్ నెట్‌వర్క్, పూర్తి సామర్థాన్ని ఉపయోగించని థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి. అయినా, తీవ్ర విద్యుత్ కొరత నెలకొని ఉంది. ఇందుకు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే దీనకంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం” అంటూ మర్మగర్భంగా, వ్యంగ్యంగా విమర్శించారు. “బొగ్గు మంత్రిత్వ శాఖ ఉంది, రైల్వే మంత్రిత్వ శాఖ ఉంది, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉంది. అయితే తప్పంతా కాంగ్రెస్‌దేనని ఆ శాఖ మంత్రులు చేతులు దులిపేసుకుంటున్నారు” అని చురకంటించారు చిదంబరం.
“ ప్రభుత్వం మంచి పరిష్కారాన్నే కనుగొంది. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, కోల్ రేక్స్ నడుపుతున్నారు. మోడీ హై, ముమ్‌కిన్ హై” అంటూ మాజీ కేంద్ర మంత్రి చిదంబర్ ట్వీట్ల పరంపరను కొనసాగించారు. ఇదిలావుండగా విద్యుత్ కోతలపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రానిదే బాధ్యత అంటూ దుమ్మెతిపోస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయకుండా నాటకాలాడుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News