- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, హెల్పర్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి 15 వరకు అంగన్‌వాడీ టీచర్లకు, 15 నుంచి 30 వరకు హెల్పర్లకు సెలవులు ప్రకటించారు. సిబ్బంది కొరత ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సెలవుల్లో లబ్దిదారులకు టేక్ హోం రేషన్(ఇంటికి సరుకులు) అంద జేయాలని తెలిపారు.
- Advertisement -