- Advertisement -
ఇటావా : ఉత్తరప్రదేశ్‌లో బొగ్గు నిల్వలతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి ఇటావా సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు నిల్వల చేరవేతకు అత్యవసర ప్రాతిపదికపై గూడ్స్ రైళ్లలో సరుకు చేరవేత ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ క్రమంలో ఎక్దిల్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పడం వీటిలోని బొగ్గు పట్టాలపై పడిపోవడంతో ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- Advertisement -