- Advertisement -
బెంగుళూరు భామ కృతి శెట్టి ’ఉప్పెన’ సినిమాతో స్టార్ బ్యూటీగా నిలిచింది. ఆతర్వాత ఆమె నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’, ’బంగార్రాజు’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం కృతి శెట్టి… ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజవర్గం, ది వారియర్, సూర్యతో తమిళ చిత్రంలో నటిస్తోంది. అయితే కృతి శెట్టికి ఓ డ్రీమ్ రోల్ ఉందట. “నాకు ఎప్పుడు ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. ఇప్పటి వరకు నేను చేసినవన్నీ వేటికవే భిన్నమైనవి. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి సవాలు విసిరే పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. ఇక నాకు రాకుమారి పాత్రలో నటించాలనుంది. అది నా డ్రీమ్ రోల్”అని చెప్పింది.
- Advertisement -