Monday, December 23, 2024

గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌!

- Advertisement -
- Advertisement -

 

Gas Cylinder

హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట నూనెల ధరలతో సామాన్యుడు ఆందోళనకు గురవుతుంటే గ్యాస్‌ బండ రూపంలో మరోసారి షాక్‌ తగిలింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన సిలిండర్‌ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే మే 1వ తేదీన కూడా సిలిండర్ ధరలను సవరించాయి. ఈ క్రమంలో సామాన్యులకు, వ్యాపారులకు మరోసారి షాకిచ్చాయి. తాజాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధర (19 కేజీలు) రూ.102.5 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో  19 కేజీల సిలిండర్ ధర రూ.2355.5కి చేరింది. అంతకు మందు రూ. 2,253 ఉంది. కాగా, ఏప్రిల్ 1వ తేదీన 19 కేజీల సిలిండర్ ధరను ఒకేసారి రూ.250 పెంచిన విషయం తెలిసిందే.  ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,002గా కొనసాగుతోంది. కాగా, చిన్న గ్యాస్‌ సిలిండర్‌ (5కేజీలు) ధర రూ. 655గా కొనసాగుతోంది.

– హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్ ధర రూ.2,563.
– విశాఖపట్టణంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2, 413.
– విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,501కి చేరుకుంది.  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News