- Advertisement -
హైదరాబాద్: కె. సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘ముత్తయ్య’ అనే సినిమా టీజర్‌ను నాచ్యురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ‘అష్టాచమ్మా’ సినిమాలో అవకాశం రాకపోతే 70ఏళ్ళకు నేను కూడా ముత్తయ్య లాగే అయ్యేవాడిని నాని అన్నారు.ముత్తయ్య టీజర్ తన మనసుకు హత్తుకుందని నాని పేర్కొన్నాడు. ఇక, ఎంతో నాచురల్ గా రూపొందించిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ‘పానమంత పీక్తది సినిమా సినిమా అని పొద్దున లేస్తే.. ఒక్కసారి పరద మీద కనిపించి సచ్చిపోయినా పర్లేదురా’ అనే డాలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహిస్తుండగా.. ఫిక్షనరీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వ్రింద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.
Muthayya Movie Teaser Released
- Advertisement -