Friday, December 20, 2024

ఢిల్లీపై లక్నో ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2022: LSG win by 6 runs against DC

ముంబై: లక్నో సూపర్ జెయింట్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఆదివారం వాంఖడే స్టేడి యం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో రాహుల్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. మోసిన్ ఖా న్(4/16) దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు లక్నో నిర్ణయించిన టార్గెట్‌ను అందుకోలేపోయారు. ఢిల్లీ జట్టు సారధి రిషభ్‌పంత్(44), చివర్లో అక్షర్ పటే ల్(42), మైకేల్ మార్ష్(37), పావెల్(35)లు బ్యా ట్‌తో రాణించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. కాగా, ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఏడింటిలో విజయం సా ధించి పాయింట్ల పట్టిలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది.
రాహుల్ దూకుడు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఓపెనర్లు క్విం టన్ డికాక్(23), కెఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే వీరి జోరుకు శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో డికాక్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడింది. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో లక్నో 10 ఓవర్లలోనే 94 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసి 35 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే దీపక్ హుడా సైతం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం కెఎల్ రాహుల్ చెలరేగి ఆడడంతో ఢిల్లీ ముందు లక్నో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. హుడా, రాహుల్ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
లలిత్ సూపర్ క్యాచ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లను పట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే టిమ్ సౌతీ, శుబ్ మన్‌గిల్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడులు కళ్లు చెదిరే క్యాచ్‌లను అందుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ లలిత్ యాదవ్ కూడా చేరాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఈ ఢిల్లీ ప్లేయర్ బౌండరీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. 71 పరుగుల చేసి సెంచరీ వైపు దూసుకెళ్తోన్న కెఎల్ రాహుల్‌ను అతన సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని రాహుల్ భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉన్న లలిత్ యాదవ్ గాల్లోకి ఎగురుతూ సిక్సర్ వెళ్లే బంతిని అందుకున్నాడు. అనంతరం బౌండరీ లైన్‌ను తాకకుండా తనను తాను నియంత్రించుకుని క్యాచ్ ఒడిసి పట్టాడు.

IPL 2022: LSG win by 6 runs against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News