గాంధీనగర్: సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం గుజరాత్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో తెలంగాణ ఎంపిలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా జీవించవచ్చని మల్ధారిస్ గిరిజనుల వద్ద తెలుసుకున్నామన్నారు. సంచార జాతుల సంస్కృతి పార్లమెంటరీ స్టాండింగ్ ఆకట్టుకుంటుందన్నారు. ఇది కాదా రిఫ్రెస్ అంటే అని ఎంపి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ మల్ధారీలు జానపద పాటలు పాడుతున్నప్పుడు వారి ముఖాల్లో సంతోషం కనిపించిందన్నారు.
“No need to know the language when it comes to music”. Look at the happy faces while these Maldharis sing their folk song in their language. Isn’t it refreshing.👌😊 pic.twitter.com/vSlC2sYeqg
— Santosh Kumar J (@MPsantoshtrs) May 2, 2022