Saturday, November 23, 2024

చావు బతుకుల రేవుల నడుమ సామాన్యజనం

- Advertisement -
- Advertisement -

First civilians leave Mariupol steel plant

మేరియూపోల్‌లో సవాలైన తరలింపు ప్రక్రియ

జపోరిజజియా : ఉక్రెయిన్‌లోని మేరియూపోల్‌లోని ఓ ప్రఖ్యాత స్టీల్‌ప్లాంట్‌లో చిక్కుపడ్డ పౌరుల తరలింపు ప్రక్రియ ఆరంభం అయింది. స్థానికంగా ఇప్పటికీ ఉధృతమవుతూ వస్తోన్న రష్యాబాంబు దాడులతో పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లుతున్నారు. ఈ లోగా ఇక్కడి స్టీల్‌ప్లాంట్ ఆవరణ ఒక్కటే ఇప్పటికీ ఉక్రెయిన్ సేనల ఆధీనంలో ఉండటంతో ఇది సురక్షితంగా భావించి అత్యధిక సంఖ్యలో పౌరులు తమ కుటుంబాలతో ఇక్కడికి చేరారు. ఈ ప్రాంతం నుంచి సహాయక బృందాలు చిక్కుపడి ఉన్న ప్రజలను దూర ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ఇంతకాలం బందీగా ఉండాల్సిన పరిస్థితి నుంచి బయటపడ్డ వారిలో కొందరు బయటకు వచ్చారు. అయితే ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో జనం లోపల ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ముందుగా వృద్ధులు, పిల్లలను చుట్టూ పేరుకుపోయి ఉన్న శిథిలాలు మట్టిదిబ్బల నుంచి అక్కడికి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపోరిజజియాకు తరలించే పని ఆరంభమైనట్లు దేశాధ్యక్షులు జెలెన్‌స్కీ సోమవారం విలేకరులకు తెలిపారు.

ఓ వైపు స్టీల్‌ప్లాంట్‌లోని ఉక్రెయిన్ సైనిక దళాలను బయటకు రప్పించేందుకు విరామం లేకుండారష్యా బలగాలు దాడులు సాగిస్తూ ఉండగా ఇక్కడి నుంచి కేవలం సామాన్య పౌరులను బయటకు తీసుకురావడం సురక్షిత ప్రాంతాలకు పంపించడం అత్యంత క్లిష్ట పరిణామం అయింది. తరలింపు ఈ దశలో వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం జరిగితే ఈ యుద్ధ ప్రాంతంలో మానవ ప్రాణాల రక్షణ ప్రక్రియలో ఇది అత్యంత కీలక పరిణామం అవుతుందని ఉక్రెయిన్ అధికారులు స్పందించారు. మేరియూపోల్ దాదాపుగా రష్యాసేనల వశం అయింది. అయితే ఇప్పటికీ ఇక్కడి స్టీల్‌ప్లాంట్‌ను తమ దుర్భేధ్యస్థావరంగా చేసుకుని ఉక్రెయిన్ సేనలలోని ప్రత్యేక దళాలు కొన్ని ఇక్కడ తిష్టవేసుకుని రష్యా సేనల ఆక్రమణను ప్రతిఘటిస్తున్నాయి. దీనితో ఈ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా దెబ్బతీయాలని రష్యా ఆలోచిస్తోంది. అయితే లోపల అత్యధిక సంఖ్యలోనే స్థానిక పౌరులు ఉండటంతో దాడులను తీవ్రతరం చేయలేకపోతోంది.

అయితే ఎప్పుడైనా రష్యా బలగాలు ఈ స్టీల్‌ప్లాంట్‌ను దెబ్బతీస్తాయనే అంచనాలతో ఇక్కడి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇంతకు ముందు జరిగిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ప్రజలను నగరం నుంచి అజోవ్ సముద్రం మీదుగా బయటకు తరలించేందుకు అధికారులు యత్నించారు. అయితే రష్యా సేనలు అడ్డుకోవడంతో జనం దిక్కులేనిస్థితిలో పడ్డారు. ఇంతకు ముందు ఇక్కడి నుంచి పారిపోయేందుకు వెళ్లుతున్న ప్రజల వాహనాలు తగులబడ్డాయి. సేఫ్ కారిడార్‌లుగా ప్రకటించి అందుకు రష్యా సేనలే సమ్మతించి ఈ మార్గంలో వెళ్లే పౌరులపై కూడా రష్యా బలగాలు బాంబుదాడులకు దిగడం దారుణం అని ఉక్రెయిన్ విమర్శించింది. చిక్కుపడ్డ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కట్టుబడి ఉంటామని ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News