Tuesday, December 24, 2024

డిజిపి కార్యాలయంలో శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలను మంగళవారం నాడు డిజిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు శ్రీ బసవేశ్వర్ మహరాజ్ చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించిన పోలీసు అధికారులు మాట్లాడుతూ సమాజంలోని కుల వ్యవస్థ తో పాటు వర్ణ భేదాలు, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాదయిన శ్రీ బసవేశ్వర మహరాజ్ మనందరికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నివాళులు అర్పించిన వారిలో సీ.ఎస్.ఓ యోగీశ్వర్ రావు, డీ.ఎస్.పి. వేణుగోపాల్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది వున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News