Friday, December 20, 2024

జంట మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగర శివార్లలో కుళ్లిన స్థితిలో ఆడ, మగ మృతదేహాలు
వివాహేతర సంబంధమే హత్యలకు కారణమా?

మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఓ యువకుడు, మరో మహిళ మృతదేహాలు నగ్నంగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటం స్థానికంగా సంచలనం మారింది. కుళ్ళిన మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఈ జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సికింద్రాబాద్ మెట్టుగూడ వారనాసి భౌద్ధనగర్‌కు చెందిన ఎడ్ల యశ్వంత్ (22) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత ఆదివారం సాయంత్రం 6 గంటలకు తన తమ్ముడి స్కూటీ తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయాడు. మంగళవారం ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడం బ్రిడ్జి సమీపంలో గుంతపల్లి సర్వేనం.148, 149 పాత రోడ్డులో ఓ గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతుండగా సమీపంలో భరించలేనంతగా దుర్వాసన వస్తుండడంతో చెట్టుపై నుంచి పరిశీలించి చూశాడు.

సమీపంలోనే చెట్ల పొదల నడుమ ఉన్న గుంతలో నగ్నంగా ఉన్న రెండు మృతదేహాలు కనిపించాయి. వెంటనే గీత కార్మికుడు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ వాసం స్వామి హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జంట హత్యల విషయం తెలిసిన వెంటనే ఎల్బీనగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసిపి పురుషోత్తంలు అక్కడకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. యశ్వంత్ అనే యువకుడి మృతదేహాంతో పాటు మరో మృతదేహాం వివాహిత మహిళ జ్యోతి (28)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధమే హత్యలకు దారి తీసిందనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల సమీపంలోనే ఉన్న స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు మృతుడు యశ్వంత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ జంట హత్యలకు గల కారణాలను పై ముమ్మరంగా దర్యాప్తు నిర్వహింస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెక్కీ నిర్వహించి హత్యలు..?

కలకలం సృష్టించిన జంట హత్యలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో ఉండే యశ్వంత్ అనే యువకుడు జ్యోతి అనే వివాహిత మహిళతో అక్రమ సంబంధమే హత్యలకు దారి తీశాయనే చర్చ జరుగుతుంది. నగరంలో ఉండే ఇరువురు తరుచూ శివారు ప్రాంతలోని కొత్తగూడం బ్రిడ్జి సమీపంలోకి వచ్చి వెళ్తున్నారనే విషయం పసిగట్టిన వ్యక్తులు ఈ హత్యలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యశ్వంత్, జ్యోతిల అక్రమ సంబంధం విషయం తెలిసిన వారే ముందే రెక్కీ నిర్వహించి ఇరువురి ఒంటిపై ఎలాంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉన్న సమయంలో హత్యలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాటసింగారం కొత్తగూడం చౌరస్తాలోని సిసి కెమెరాల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News