Monday, December 23, 2024

బిజెపి, కాంగ్రెస్‌లపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌

- Advertisement -
- Advertisement -

MInister Harish rao Inauguration of Mother and Child Hospital

పెద్దపల్లి : రాహుల్ గాంధీ ఎందుకోసం వస్తున్నావ్.. ఏం చెప్పడానికి వస్తున్నవ్. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పతాకాలు ఉన్నాయా? గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ ది. అధికారం కోసం ఎంత నీచమైన స్తాయికైనా దిగజారే పరిస్థితి వారిదని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ రావొద్దని అడ్డం పడ్డ ద్రోహి చంద్రబాబుతో ఎవరన్నా పొత్తు పెట్టుకుంటారా.. అధికారం కోసం ఆత్మాభిమానం మంట గలిపెస్తారు. జాగ్రత్తగా ఉండాలన్నారు. మాది బతుకు దెరువు కోసం ఆరాటం.. వాళ్ళది కుర్చీల కోసం కొట్లాటని మంత్రి తెలిపారు. తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీఅని ప్రశ్నించారు. రాహుల్ పోతే ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతని ఎద్దేవా చేశారు. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా అయిందని విమర్శించారు. మిస్టర్ బండి సంజయ్.. కేంద్రం లో ఉన్న 15.62 లక్షల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పండి. తాజాగా 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు. కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత, రైతుల కష్టాలు, కన్నీళ్లు, కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్ళు రాక పంటలు ఎండి పోయేవన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఇస్తున్నట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారా.. మార్కెట్ పోతే ధర రాని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండే. కాళేశ్వరం కానే కాదు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ముడున్నరెళ్ళలో పూర్తి చేసామని హరీశ్ రావు వెల్లడించారు. ఒకప్పుడు నీళ్ళ కోసం ధర్నాలు.. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి ఆపండి అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో 99 లక్షల మెట్రిక్ టన్నులు పండితే.. ఇప్పుడు 2.59 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం పండుతున్నదన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం మేము కొనలేము అని చేతులు లేవట్టే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతు బంధు సాయం, రైతు బీమా సాయం, ఉచిత కరెంట్, కాల్వల్లో నీల్లు పారితే పంట పండింది. రైతును ముఖ్యమంత్రి రాజుని చేశారని హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కోతలు ఉన్నాయి. వారానికి రెండు రోజులు పవర్ హాలిడే లు పెడుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కానీ తెలంగాణలో నిరంతర విద్యుత్ పంపిణీ చేస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.

పెద్దపల్లి పట్టణంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వందపడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కోరుకుంటి చందర్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, రమణ, టీఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రూ. 18 కోట్లతో, ముఖ్యమంత్రి ఆశీస్సులతో 100 పడకల మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నాడు 6 మాత్రమే ఉంటే, ఇప్పుడు ఈ ఆస్పత్రుల సంఖ్య 28కి చేరిందన్నారు. తల్లి, బిడ్డ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రూ. 403 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అని ఉండే… నేడు పరిస్థితులు మారాయని చెప్పారు. కెసిఆర్ కిట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30నుండి 56 శాతానికి చేరిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపారు. ఇప్పటికే నీళ్ళు, వ్యవసాయంపై దృష్టి సారించింది ఎంతో పురోగతిని సాధించాం. ఇప్పుడు విద్య, వైద్యం ప్రాధాన్య అంశంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మెడికల్ కాలేజీల వల్ల ఇక్కడి ప్రాంతాలు రూపురేఖలు మారుతున్నాయి. అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. వ్యవసాయం విషయంలో కేంద్రం రైతులను మోసం చేస్తున్నది. వడ్లు కొనం అంటే సిఎం కెసిఆర్ ఎంత ఖర్చు అయినా రైతులకు న్యాయం చేస్తా అన్నారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News