Monday, December 23, 2024

పోలీసు ‘బలగాల’బలోపేతం

- Advertisement -
- Advertisement -

ఈ ఏ దాడి 21,969 పోస్టులకు నోటిఫికేషన్

21000 Police Notification released in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణే కీలకమని భావించిన ప్రభుత్వం పోలీసు శాఖలో వివిధ విభాగాలలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు సంబంధించి దాదాపు 21,969 నూతన నియామకాలకు రెండు విడతలుగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. తొలి విడతలో 21,291 పోస్టులు, రెండవ విడతలో పోలీసు రవాణా విభాగం, అబ్కారీ శాఖలో కలిపి 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లను బర్తి పూర్తి అయితే రాష్ట్రంలో పోలీసు బలగాలు లక్ష ఇరవైవేలు దాటే అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. రాష్ట్రంలో 2013,20-14లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగులుండగా, 2019, 20-20 నాటికి వీరి సంఖ్య 86,829 కి పెరిగింది. తాజాగా 2022 పోలీస్‌శాఖను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖలో దాదాపు 22వేల మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా 2014 జూన్ లో పోలీసు శాఖలో 8,447 పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాలు జరిగాయి. ఇందులో 1133 మంది మహిళలు ఉద్యోగం పొందారు. అనంతరం 2017లో రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీస్‌శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేసింది. సివిల్ లో 9,629 పోస్టులు, ఏఆర్ 5,538 పోస్టులు, టి.ఎస్.ఎస్.పి.లో 2,075 పోస్టులు, కమ్యూనికేషన్స్ 143 పోస్టులు, మినిస్టీరియల్ లో599 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం జులై 2017లో ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే మరోమారు 2018 ఫిబ్రవరి 3న వివిధ హోదాల్లో కలిపి మరో 14,177 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ హోంశాఖ కార్యాలయంఉత్తర్వులు జారీచేసింది. 2022లో పోలీసు శాఖలో పాటు ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్ల శాఖలో 17,291 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగతా 587 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.

ముఖ్యంగా సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టిఎస్‌ఎస్‌పి బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులున్నాయి) ఎస్‌ఐ పోస్టులు 587, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ శాఖలలో ఖాళీలను బర్తి చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా 18,491 హోంగార్డుల వేతనాలు 2017డిసెంబర్ 13న వారి వేతనాలను రూ.12 వేల నుంచి రూ.22 వేలకు పెంచారు. ముఖ్యమంత్రి కేసిఆర్ 2017 డిసెంబర్ 13న ప్రగతి భవన్‌లో హోంగార్డుల జీతాల పెంపు ప్రకటన చేసిన విషయం విదితమే. ఈక్రమంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులలో పోలీసులు ప్రజలకు సేవలంది మన్ననలు అందుకున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిషిషన్ పూర్తి అయితే రాష్ట్రంలో పోలీసు బలగాల సంఖ్య లక్షా ఇరవైవేలు దాటే అవకాశం ఉంది.

‘పోలీసు’ ఆస్తుల డిజిటలైజేషన్

రాష్ట్రంలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతోపాటు డిజిటలైజ్ చేసిన తొలి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖకు చెందిన 940 ఆస్తులను గుర్తించి వాటిలో 7050 ఎకరాల 24 గుంటల భూములున్నట్లు నిర్దారించారు. 167 పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు ప్రయివేట్ భవనాలతో పాటు మరో 42 స్థలాలు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను కేటాయించారు. పోలీస్ శాఖకు చెందిన భవనాలను, పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలనన్నింటినీ ఎత్తు, వెడల్పు, భవన స్వరూపం,జీపీఎస్ కోఆర్డినెట్స్ తో సహా డిజిటల్ ఫోటోలను రిమోట్ సెన్సింగ్ సహాయంతో రూపొందించి త్వరలోనే పోలీస్ వెబ్ సైట్ లో ఉంచనున్నారు. పోలీస్ శాఖ ఆస్తుల నిర్దారణ డిజిటలైస్ చేయడంద్వారా భూములు ఆక్రమణలకు గురికావని, పైగా ఏదైనా లీగల్ వివాదాలు ఏర్పడినా సరైన రికార్డులు స్పష్టమైన రీతిలో ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News