- Advertisement -
కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ – 2’ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ ఛాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్‌తో పాటు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. కన్నడతో పాటు మిగతా సౌత్ భాషలు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది ఈ చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించి బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల తరహాలోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటిన ఇండియన్ సినిమాగా నిలిచింది.
- Advertisement -