పుణె: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఊరట విజయం లభించింది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకొంది. ఈ గెలుపుతో బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(30), డుప్లెసిస్(38) శుభారంభం అందించారు. కెప్టెన్ డుప్లెసిస్ దూకుడుగా ఆడాడు. 22 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేశాడు. మహిపాల్ లొమ్రార్(42), రజత్(21), కార్దీక్ 26(నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (28), డేవొన్ కాన్వే (56) రాణించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో బెంగళూరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇక మోయిన్ అలీ(34) బాగానేఆడినా జట్టును మాత్రం గెలిపించలేక పోయాడు. కాగా, హాజిల్‌వుడ్, మాక్స్‌వెల్, హర్షల్ పటేల్ మెరుగైన బౌలింగ్‌తో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.
IPL 2022: RCB Win by 13 runs against CSK