- Advertisement -
2017 నాటి ఆజాదీ యాత్ర కేసులో తీర్పు
మెహసానా(గుజరాత్): అనుమతి లేకుండా ఆజాదీ యాత్ర నిర్వహించారని ఆరోపిస్తూ ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతోపాటు మరో 9 మందికి మూడు నెలల కారాగార శిక్ష విధిస్తూ స్థానిక మెజిస్టీరియల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఐపిసిలోని సెక్షన్ 143 కింద చట్టవిరుద్ధంగా యాత్ర నిర్వహించినందుకు దోషులుగా అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ జెఎ పర్మర్ నిర్ధారించారు. మేవానీతోపాటు ఎన్‌సిపి నాయకురాలు రేష్మా పటేల్, మేవానీకి చెందిన రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్‌కు చెందిన కొందరు సభ్యులకు కోర్టు కారాగార శిక్ష విధించడంతోపాటు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 12 మందిని నిందితులుగా పేర్కొనగా వీరిలో ఒకరు మరణించారు. మరో నిందితుడు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.
- Advertisement -