న్యూఢిల్లీ : ఆసియాలో అత్యంత సంపన్నుడు గౌతమ్ అందానీ మీ డియా రంగంలో పెట్టుబడుల దిశ గా ప్రయత్నాలు వేగవంతం చేశా రు. షిప్పింగ్, కోల్‌మైనింగ్‌తో బ హుళ రంగాల్లో పెట్టుబడులను పెంచే ప్రణాళికలో భాగంగా మీడియాలో విస్తరణపై అదానీ దృష్టి పెట్టారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని స్థానిక టెలివిజన్, ప్రింట్ న్యూస్ సంస్థల్లో వాటాల కొనుగోలు కోసం అదానీ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పలు సంస్థలు కూడా ఆయన్ని సంప్రదిస్తున్నాయి. ఈ దిశగా చర్చలు కూడా నడుస్తున్నాయని, అయితే పూర్తి వివవరాలు తెలియా ల్సి ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు అదానీ గ్రూ ప్ నిరాకరించింది. 2.7 ట్రిలియన్ డాలర్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ లో ముకేశ్ అంబానీ(65), గౌతమ్ అదానీ (59) పోటీపడుతున్నారు. ఇటీవల అదానీ వేగంగా తన సంపదను పెంచుకుంటూ ప్రపంచంలో ఐదో సంపన్నుడిగా ర్యాంక్‌గా సా ధించారు. తాజాగా ముకేశ్, అందానీలకు మీడి యా రంగం కీలకంగా మారింది.
టీవీ, ప్రింట్ మీడియాపై అదానీ దృష్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -