Monday, December 23, 2024

ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

రాజశేఖర్… అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న ‘శేఖర్’ సినిమా కూడా అంతే ఎమోషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శేఖర్’. ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ ఇండియా మొత్తం విడుదల చేస్తుండగా నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హీరో అడవి శేష్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ “ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కించాము. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆశీర్వదించాలి”అని అన్నా రు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ “ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితుల వలన కుదరలేదు.

ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తున్నాము”అని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాసు మాట్లాడుతూ “ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా చాలా బాగా వచ్చింది అంటే చూశాను. జీవిత మంచి కథను ఎంపిక చేసుకొని తనే దర్శకత్వం వహించి చాలా చక్కని సినిమాను తీశారు. అందుకే నేను ఈ సినిమాను ఇండియా మొత్తం విడుదల చేస్తున్నా”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పవ న్ సాదినేని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, ఈషా రెబ్బా రవి వర్మ, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News