Monday, December 23, 2024

గుజరాత్ కెమికల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం- ఆరుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

 

Gujarat chemical Plant Fire incident

అహ్మదాబాద్: భరూచ్‌లోని అంక్లేశ్వర్‌లోని యుపిఎల్ కెమికల్ తయారీదారు కర్మాగారంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  కనీసం ఆరుగురు కార్మికులు గాయపడ్డారు.

అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భరూచ్‌లోని అంకలేశ్వర్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) ప్రాంతంలోని కెమికల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం గురించి ఉదయం 7 గంటలకు ఒక ఆందోళనకర కాల్ వచ్చింది.

మంటలు చెలరేగిన కొద్దిసేపటికే ఫ్యాక్టరీ ఆవరణలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుని చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News