Monday, December 23, 2024

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Minister Bojjala Gopalakrishna Reddy passed away

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. కాసేపటి క్రితం అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బొజ్జల శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎంఎల్ఏగా గెలుపొందారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు బొజ్జల అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు మంత్రివర్గంలో బొజ్జల మంత్రిగా పనిచేశాడు. 1949 ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా ఉరండూరులో జన్మించిన ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ,లా చేశారు. బొజ్జల ఆకస్మికంగా మృతి చెందడంతో టిడిపి నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News