Monday, December 23, 2024

మాంగల్యానికి ముందు ముడి

- Advertisement -
- Advertisement -

Married before reaching legal age

పెళ్లీడుకు ముందే పెళ్లిళ్లు బెంగాల్‌లోనే ఎక్కువ
దక్షిణాదిలో మేనరికాలు రక్తసంబంధాలు
వెలుగులోకి వస్తోన్న ఆర్థిక సామాజికాంశాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : చట్టపరమైన వయోపరిమితిని తీసి గట్టున పెట్టి దేశంలో వివాహాలు జరుగుతున్నాయి. 18నుంచి 29 ఏండ్ల మధ్యలో ఉండే మహిళలో పాతికశాతం, 21 నుంచి 29 వయస్సులో ఉండే మగవారిలో 15 శాతం వరకూ చట్టపరమైన పెళ్లీడుకు ముందే ఓ ఇంటివారవుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)లో వెల్లడైంది. 2019 21 మధ్యకాలంలో ఈ సర్వే జరిపారు. దేశంలో మహిళలకు పెళ్లి అర్హత వయస్సు 18. కాగా మగవారిలో దీనిని 21గా చట్టప్రకారం ఖరారు చేశారు. కేంద్రం ఈ వయస్సును త్వరలోనే సమానం చేయాలనుకొంటోంది. సంబంధిత వయోపరిమితిని ఖరారు చేసే ఆలోచనలో ఉంది.

మమత రాష్ట్రంలో ముందస్తు తంతు

పశ్చిమబెంగాల్‌లో ప్రతి ఐదుగురు మహిళలలో ఇద్దరు వయో పరిమితికి ముందే పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఇక్కడ ఇటువంటి వివాహాలు 42 శాతం వరకూ ఉంటున్నాయి. తరువాతి క్రమంలో బీహార్‌లో 40 శాతం, త్రిపురలో 39 శాతం, జార్ఖండ్‌లో 35 శాతం, ఎపిలో 33 శాతం నమోదయ్యాయి. తరువాత అసోంలో ఇవి 32 శాతం, దాదర్ నగర్ హవేలీ, డయ్యూ డమన్‌లలో 28 శాతం, తెలంగాణలో 27 శాతం, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 25 శాతం వరకూ జరుగుతున్నట్లు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ తెలిపింది. లక్షద్వీప్‌లో ఈ పరిణామం 4 శాతంగా తక్కువగా ఉంది. ఇక బీహార్‌లో మగవారిలో పాతిక శాతం మంది, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 24 శాతం చొప్పున, జమ్మూ కశ్మీర్‌ల, లడఖ్‌లలో ఆరు శాతం చట్టపరమైన వయస్సు కన్నా ముందే పెళ్లిళ్లలకు దిగుతున్నట్లు గుర్తించారు.

లక్షద్వీప్‌లో తక్కువ

ఈ క్రమంలో మగవారిలో తక్కువ స్థాయిలో లక్షద్వీప్, చండీగఢ్‌లలో ఇవి రికార్డు అయ్యాయి. కేరళ తప్పిస్తే మిగిలిన దక్షాణాది రాష్ట్రాలలో ఎక్కువగా మేనరికం ఇతరత్రా రక్త సంబంధాలు ఉండే వారిలో ఎక్కువగా చట్టబద్ధమైన వయో పరిమితితో నిమిత్తం లేకుండా పెళ్ళిళ్లు జరుగుతున్నట్లు స్పష్టం అయింది. ఇక మతపరమైన వర్గాలలో పోల్చిచూస్తే ముస్లిం మహిళలలో ఎక్కువగా 1519 ఏండ్ల లోపు వారిలో వివాహాలు జరుగుతున్నాయి. ఇది 8 శాతంగా నమోదైంది.

707 జిల్లాల్లో అధ్యయనం

45 నుంచి 49 ఏండ్ల మహిళలలో తొమ్మండుగురిలో ఒక్కరు వితంతువు అవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వేను దాదాపు 6.37 లక్షల ఇండ్లల్లో నిర్వహించారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుకు చెందిన 707 జిల్లాల్లో మొత్తం 7,24,115 మంది మహిళలు, 1,01,839 మందిమగవారిపై సర్వే జరిపారు. సామాజిక ఆర్థిక అంశాలు ఇతరత్రా నేపథ్య అంశాలను విశ్లేషించుకునేందుకు ఈ అధ్యయనం దారితీసింది. ఇది ఇక ముందు ప్రభుత్వం రూపొందించే పాలసీ విధానాలు, సమర్థవంతమైన కార్యక్రమాల రూపకల్పన వాటి అమలుకు దారితీస్తుందని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News