బండీ.. నాలుక కోస్తా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర హెచ్చరిక
సంజయ్‌కు సంస్కారం ఉందా?
ఆయన ఇంట్లోంచి ఏమైనా
గుంజుకున్నామా.. వ్యక్తిగత
దుషణలకు ఎందుకు
పాల్పడుతున్నాడు? సిఎం
కెసిఆర్‌ను రాష్ట్ర మంత్రులను
పట్టుకొని ఇష్టానుసారంగా
మాట్లాడుతున్నారు రూ.20వేల
కోట్లతో కాళేశ్వరం పూర్తయ్యేదని
బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా
పచ్చి అబద్ధం ఆడాడు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన
ఎత్తిపోతల అంత తక్కువ ఖర్చుతో
పూర్తవుతుందా?
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి నిప్పులు కురిపించారు. హద్దుమీరి మాట్లాటితే నాలుకు కోస్తానని ఘాటు గా హెచ్చరించారు. అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని సూచించారు. కౌ న్సిలర్ స్థాయికి కూడా పనికిరాని ఆయన సిఎం కెసిఆర్, రాష్ట్ర మంత్రులను పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు బండికి ఏమైనా సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు. ఆయన ఇంట్లో నుంచి ఏమైనా గుంజుకున్నామా? ఎందుకు వ్యక్తిగత దూషణలను పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్రవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాద వ్, పట్నం నరేందర్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ఎండలో తిరుగుతున్న బండికి మ తిభ్రమించిందన్నారు. ఆయనను తక్షణమే పిచ్చాస్పత్రి లో చేర్చాలన్నారు. ఆరోపణలు చేయడం కాదు.. నిరూపించాలన్నారు. సిఎం కెసిఆర్ పులి లాండోదు.. వాడిని అనవసరంగా గిల్లే ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు.
రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ అన్నా.. తెలంగాణ అన్న పంచ ప్రాణాలన్నారు. అందువల్లే కెసిఆర్‌ను ఓడించే స త్తా బిజెపికి లేదన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో పాలమూరు జిల్లా పచ్చబడ్డదన్నారు. అలాంటి పాలమూరును పాదయాత్రల పేరిట విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి వారు తట్టుకోలేకపోతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించా రు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని చెప్పారన్నారు. కాని ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తెలంగాణ పుట్టుక నుంచే బిజెపి ఈ ప్రాంతంపై వివక్షను ప్రదర్శిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఎపికి కేంద్రం కట్టబెట్టిందన్నారు. అయినా సిగ్గు.. శరం… లజ్జ లేకుండా బిజెపి నేతలు రెండు రోజుల క్రితం పాలమూరులో మరోసారి పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. సంజయ్ నత్తితో మాట్లాడుతున్నారు.. ఎం చెబుతున్నారో అర్ధం కావడం లేదని వ్యంగ్యస్త్రాలను సంధించారు. ఒక ఎంపిగా కొనసాగుతున్న ఆయన రౌడీలా మాట్లాడుతున్నారన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం లో ఎక్కడున్నాడో తెలియని ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. బిజెపి జాతీయ అధ్యశ్రుడు నడ్డాకు కనీస జ్ఞానం లేదు కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 20 వేల కోట్లతో పూర్తయ్యేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పచ్చి అబద్ధం మాట్లాడారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎత్తిపోతల పథకం రూ.20 వేల కోట్లతో పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. అసలు నడ్డాకు
కనీస జ్ఞానం ఉందా? అని నిలదీశారు. పార్లమెంటులో తెలంగాణ కు వస్తున్న ప్రశంసలు నడ్డా కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పదిమంది వరకు కేంద్రమంత్రులు వచ్చి తెలంగాణ పథకాలను పొగుడుతున్నారన్నారు. నడ్డాలాంటి వాళ్లు ఎన్ని అసత్యాలు చెప్పినా తెలంగాణ ప్రజలు బిజెపిని విశ్వసించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కమలం వాడిపోవడమే తప్ప వికసించడం అనేదే ఉండదన్నారు. కాళేశ్వరం టిఆర్‌ఎస్‌కు ఎటిఎం అయితే దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణ పనుల్లో ఉన్నాయని… అవన్ని బిజెపికి ఎటిఎంలేనా? అని ప్రశ్నించారు. అసలు దేశం పాలిట బిజెపి పార్టీయే పెద్ద ఎటిఎంగా మారిందని విమర్శించారు.