Friday, December 20, 2024

హవానాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో పేలుడు…22మంది మృతి

- Advertisement -
- Advertisement -

Havana 5 star hotel blast

హవానా: సెంట్రల్ హవానాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన శక్తివంతమైన పేలుడులో 22 మంది మరణించారు. అనుమానాస్పద గ్యాస్ లీక్ వల్ల జరిగిన పేలుడులో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున జరిగిన పేలుడు కారణంగా గాలిలోకి దుమ్ము, పొగ వ్యాపించింది. పేలుడు కారణంగా హోటల్ భవనం ధ్వంసమైంది. కిటికీలు ఊడిపోయాయి. హోటల్ వెలుపల పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఫైవ్ స్టార్ హోటల్ మడోన్నా, బెయోన్స్, మిక్ జాగర్,రిహన్న వంటి ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని బాప్టిస్ట్ చర్చి గోపురం కూడా కూలిపోయింది. పేలుడు సమయంలో హోటల్ లోపల ఉద్యోగులు దాని పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు. ఈ పేలుడులో విదేశీయులు గాయపడినట్లు లేదా మరణించినట్లు తమకు సమాచారం లేదని పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ గార్సియా గ్రాండా తెలిపారు. గ్యాస్ ట్యాంక్‌ను రీఫిల్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని హోటల్ యాజమాన్యంలోని రాష్ట్ర కంపెనీ గవియోటాకు చెందిన రాబర్టో కాల్జాడిల్లా చెప్పారు.అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ పునరావాస పనులు చేపట్టాయి.

Havana hotel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News