Sunday, January 19, 2025

మహిళపై 79 రోజులుగా తాంత్రికుని లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

Woman sexually assaulted for 79 days

బాధితురాలిని రక్షించిన పోలీసులు

భువనేశ్వర్ : పసిబిడ్డ ఎదుటే తల్లిపై 79 రోజులుగా లైంగిక దాడికి పాల్పడిన తాంత్రికుడి చెర నుంచి బాధితురాలిని పోలీసులు రక్షించారు. ఒడిశా లోని బాలాసోర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మహిళకు 2017 లో ఒక వ్యక్తితో పెళ్లయింది. అయితే కట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు ఆమెను వేధించ సాగారు. ఈ కుటుంబ సమస్యను తొలగిస్తానని ఒక మాంత్రికుడు వారికి మాయమాటలు చెప్పి ఆ మహిళను కొన్ని నెలల పాటు తన వద్ద ఉంచాలని భర్త, అత్తమామలతో అన్నాడు. అయితే ఆ మహిళ దానికి ఒప్పుకోలేదు. రెండు నెలల కిందట అత్త మత్తుమందు ఇచ్చి ఆ మహిళను తాంత్రికుని వద్దకు చేర్చింది. ఆమె రెండున్నరేళ్ల కుమారుడిని కూడా అక్కడే వదిలేశారు. తాంత్రికుడు ఆ బాలుని ఎదుటే 79 రోజులు వరుసగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 28 న ఆమెను బంధించిన గదిలో తన మొబైల్ ఫోనును తాంత్రికుడు మరిచిపోయాడు. దీంతో ఆ మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను, ఆమె కుమారుడ్ని రక్షించారు. పరారీలో ఉన్న మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు. తాంత్రికుడడితోపాటు ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తమామలపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News