- Advertisement -
పెద్దపూర: నల్గొండ జిల్లా పెద్దపూర వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం,కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగార్జునసాగర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషయం ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులు పీఏపల్లి మండలం మల్లాపురం వాసులుగా గుర్తించారు. వివాహానికి వెళ్లి వస్తుండగా వాహనానికి ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -