Monday, December 23, 2024

సహచర నక్షత్రాన్ని స్వాహాచేసే విచిత్రం

- Advertisement -
- Advertisement -

Scientists have discovered rare "black widow trio" system

అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల అపూర్వ పరిశోధన

వాషింగ్టన్ : అమెరికా లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) శాస్త్రవేత్తలు “ నక్షత్ర విచిత్రాన్ని” గమనించారు. అది నూతన నల్లని జంట వితంతువులుగా కనిపించిందని అభివర్ణించారు. అత్యంత వేగంగా గిరగిరా తిరుగుతున్న న్యూట్రన్ నక్షత్రం లేదా పుల్సర్ …అది ప్రదక్షిణం చేస్తూ సమీపాన ఉన్న తోటి సహచర చిన్న నక్షత్రాన్ని స్వాహా చేయడాన్ని గమనించగలిగారు. శాస్త్రవేత్తలు అరుదైన “ నల్లని వితంతు త్రయ” వ్యవస్థను కనుగొనగలిగారు. ఒక నక్షత్రం ముందు జంట నక్షత్రాలు వేగంగా ఒకదానికొకటి ప్రదక్షిణం చేస్తూండగా మరోకదానిచే స్వాహాకు గురయ్యే విచిత్రాన్ని కనుగొన గలిగారు. ఈ సంఘటన 3000 కాంతి సంవత్సరాల దూరంలో సంభవిస్తోంది.

ఈ నక్షత్ర వ్యవస్థను జెడ్‌టిఎఫ్ జె 1406 గా పేరు పెట్టారు. ఈ విధంగా జరిగే నల్లని వితంతు త్రయ వ్యవస్థదేనికైనా చిన్నపాటి కక్ష ఉంటుంది. ఈ ఏకైక వ్యవస్థలో మూడో నక్షత్రం ప్రతి పదివేల సంవత్సరాలకోసారి జంట నక్షత్రాల మధ్యలో ప్రదక్షిణ చేస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. మే 4 న జర్నల్ నేచర్‌లో ఈ పరిశోధన వెలువడింది. ఈ విచిత్ర నక్షత్ర వ్యవస్థను నల్ల వితంతు సాలీడులతో పోల్చారు. మగసాలీడుతో ఆడ సాలీడు సంయోగం చెందిన తరువాత మగ సాలీడును ఆడసాలీడు కబళిస్తుంది.

ఇదే విధంగా ఇక్కడ ఒక నక్షత్రం మరో నక్షత్రాన్ని కబళిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఈ వ్యవస్థ ( జెడ్ టి ఎఫ్ జె 1406 1222) కు చిన్నపాటి కక్షకాలం ఉండటాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. పుల్సర్ నక్షత్రం తన సహచర నక్షత్రం పరస్పరం ప్రతి 62 నిమిషాలకోసారి ప్రదక్షిణం చేస్తుంటాయని చెప్పారు. ఈ పరిశోధనలో హైస్పీడ్ కెమెరాను ఉపయోగించారు. షెఫీల్డ్ శాస్త్రవేత్తలు ఈ కెమెరా ( hi percam ) ను తయారు చేశారు. నిమిషానికి వెయ్యి కన్నా ఎక్కువ ఇమేజిలను ఈ కెమెరా చిత్రించ గలుగుతుంది. గోళాకార నక్షత్ర సముదాయాలుగా పేర్కొనే పాత నక్షత్రాల దట్టమైన సముదాయం నుంచి ఈ వ్యవస్థ ఆవిర్భవించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News