Saturday, December 21, 2024

బాదములతో తల్లులకు ఆరోగ్యవంతమైన జీవితం

- Advertisement -
- Advertisement -

 Healthy Health benefits of Almonds

హైదరాబాద్: కుటుంబానికి పునాది అమ్మ, ప్రతి తల్లి, ఉద్యోగ బాధ్యతలలో ఉన్న ఆమె అయినా, గృహిణిగా ఇంటి బాధ్యతలు మాత్రమే చూసుకునే అమ్మ అయినా, అపరిమిత జాబితాతో కూడిన నిబద్ధతలు ఆమెకు ఉంటాయి. వారి ప్రయత్నాలకు తగిన మద్దతు అందించడంతో పాటుగా మాతృత్వంను వేడుక చేయడం కోసం మాతృదినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 8న నిర్వహిస్తోన్నారు. ఈ రోజు సమీపిస్తోన్న వేళ, వారి ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి పలు అంశాలపై దృష్టి సారిద్దాము.

తగినంతగా పౌష్టికాహారం, ఆరోగ్యవంతమైన అలవాట్లు ఆరోగ్యవంతమైన జీవిత నిర్వహణలో అత్యంత కీలకం. అయితే, వారి బిజీ షెడ్యూల్స్‌ కారణంగా, మాతృమూర్తులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తుంటారు. తమ కుటుంబం గురించి వీలైనంతగా పట్టించుకుంటున్నట్లుగానే తమ గురించి తాము జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనిని ప్రారంభించడానికి చక్కటి విధానం ఏమిటంటే, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేందుకు సమయం కేటాయించడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం. తీసుకునే స్నాక్స్‌ను తెలివిగా ఎంచుకోవడం ద్వారా తల్లులు తమకు కావాల్సిన పోషకాలను పొందడంలో ఎంతో దూరం వెళ్లగలరు. ఉదాహరణకు, వేయించిన స్నాక్స్‌కు బదులుగా ఓ గుప్పుడు బాదములను తీసుకుంటే వారికి ప్లాంట్‌ ప్రొటీన్‌, కాల్షియం, ఐరన్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లావిన్‌ మరియు జింక్‌ వంటివి లభిస్తాయి. వీటి తో పాటుగా ఇతర న్యూట్రియంట్స్‌ కూడా లభిస్తాయి. బాదములను క్రమం తప్పకుండా తినడం వల్ల తల్లులు ఆరోగ్యవంతమైన జీవనశైలి పొందగలరు.

మాతృదినోత్సవం రోజున పాలు ఇస్తోన్న తల్లులకు చక్కటి పౌష్టికాహార ఆవశ్యకతను గురించి రితికా సమద్దార్‌, రీజనల్‌ హెడ్‌–డైటిటిక్స్‌, మ్యాక్స్‌హెల్త్‌కేర్‌, ఢిల్లీ మాట్లాడుతూ.. ‘‘చక్కటి పౌష్టికాహారం అనేది మాతృమూర్తులకు అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా గర్భవతులకు, ఇది వారి బ్రెస్ట్‌ మిల్క్‌ మెరుగుపడేందుకు తోడ్పడటంతో పాటుగా ప్రసవానంతర సమయంలో మరింతగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఈ కాలంలో, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా ప్రొటీన్‌, కాల్షియం, ఐరన్‌ అధికంగా ఉన్నటువంటి పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు ను తమ డైట్‌లో జోడించుకోవాలి. ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ కోసం పాలిచ్చే తల్లులు ఓ గుప్పెడు బాదములు తినడం మంచిది. వీటికి ఆకలి తీర్చేగుణం ఉండటం మాత్రమే కాదు, పోషకాలతో కూడి బహుళ కీలకమైన పోషకాలనూ కలిగి ఉంటాయి. విటమిన్‌ ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌, డైటరీ ఫైబర్‌, రిబోఫ్లావిన్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, కాపర్‌, ప్రొటీన్‌, మాంగనీస్‌, కాల్షియం వీటిలో అధికంగా ఉంటాయి. వీటిలో ఫోలెట్‌, ఐరన్‌, నియాసిన్‌, థయామిన్‌, జింక్‌, పోటాషియం వంటి ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైన కీలకమైన పోషకాలు కూడా ఉంటాయి’’ అని అన్నారు.

మాతృదినోత్సవం రోజున గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం గురించి న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘గర్భధారణ సమయంలో మధుమేహం బారిన పడిన తల్లులు, భవిష్యత్‌లో మరింతగా ఈ వ్యాధి బారిన పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యవంతమైన డైట్‌, జీవనశైలి వంటివి ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ దశలో పలు ఆరోగ్యవంతమైన ఆహారాలను ఖచ్చితంగా జోడించాల్సి ఉంది. వీటిలో బాదములు లాంటి నట్స్‌ కూడా ఉన్నాయి. బాదములు ఫైబర్‌ (30 గ్రాముల సర్వింగ్‌), 15 అత్యవసర పోషకాలు (30గ్రాములు సర్వింగ్‌), మెగ్నీషియం (81ఎంజీ), పొటాషియం (220 ఎంజీ) మరియు విటమిన్‌ ఈ (7.7ఎంజీ) వంటివి ఉండటం వల్ల టైప్‌ 2 మధుమేహం లేదా అతి తక్కువ గ్లూకోజ్‌ కలిగిన వారికి అత్యున్నత పోషకాలతో కూడిన స్నాక్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు.

మాతృదినోత్సవ వేళ, మాతృమూర్తులు తమ పౌష్టికాహారం తీసుకోవడంలో చూపే నిర్లక్ష్యాన్ని గురించి ఇంటిగ్రేటివ్‌ న్యూట్రిషియనిస్ట్‌, హెల్త్‌ కోచ్‌ నేహా రంగ్లానీ మాట్లాడుతూ.. ‘‘తమ కుటుంబ ఆరోగ్యం కోసం తపించే తల్లులు తరచుగా తమ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని కారణంగా పలు స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల, వారు తమ డైట్‌లో పౌష్టికాహారం జోడించాలి. ఆ తరహా ఆహారంలో బాదములు ఒకటి. ఇది అపార ప్రయోజనాలు అందిస్తుంది. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం క్రమం తప్పకుండా బాదములను తినడం వల్ల అత్యంత ప్రమాదకరమైన ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్ధాయిలు తగ్గి, రక్షిత హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది టైప్‌ 2 మధుమేహులలో గుండె సంబంధిత సమస్యలను నివారించడంలోనూ తోడ్పడుతుంది. అందువల్ల, తల్లులు బాదములను ప్రతి రోజూ తినడాన్ని ఓ అలవాటుగా మలుచుకోవాలి (30 గ్రాములు/23 బాదములు). ఇది వారికి అవసరమైన శక్తిని అందించడంతో పాటుగా ఆకలిని తీర్చుకోవచ్చు. యూనివర్శిటీ ఆఫ్‌ లీడ్స్‌ లోని పరిశోధకులు కనుగొన్న దాని ప్రకారం, మధ్యాహ్న భోజనానికి ముందు బాదములను తీసుకోవడం (అంతే మొత్తంలో శక్తిని అందించే క్రాకర్స్‌ లేదంటే అంతే బరువు కలిగిన నీరు తాగడంతో పోలిస్తే) వల్ల ఆకలి తగ్గడంతోపాటుగా అధిక కొవ్వుకలిగిన ఆహారం తీసుకోవాలన్న కోరిక కూడా గణనీయంగా తగ్గుతుంది’’ అని అన్నారు.

తల్లులు ఎదుర్కొనే రోజువారీ సవాళ్లను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను తల్లిగా మారిన తరువాత మా అమ్మ నా కోసం చేసిన త్యాగం, ఆమె నా పట్ల చూపిన ప్రేమ అర్థమైంది. ఓ బుజ్జాయి పుట్టిన తరువాత, వారే మన ప్రపంచం అవుతారు. వారి సంతోషం కోసం ఏదైనా సరే చేయడానికి మనం సిద్ధమవుతుంటాం. అయితే, తల్లి విపరీతంగా అలిసిపోతుంటుంది. అందువల్ల, మన పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో, అంతకుమించిన శ్రద్ధ మన ఆరోగ్యం గురించి తీసుకోవాల్సి ఉంది. నేనెప్పుడూ కూడా వ్యాయామాలు చేయడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా నా శక్తి ఎప్పుడూ తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటాను. ఈ కారణం చేతనే నేను నా షూటింగ్‌ షెడ్యూల్స్‌ లేదా ప్రయాణ సమయాలలో బాదములను వెంట తీసుకుని వెళ్తుంటాను. అంతేకాదు, స్నాక్స్‌ తీసుకునే బదులుగా బాదం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన మార్పును మనం చూడవచ్చు. బాదములలో అత్యవసర పోషకాలు అయినటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి ఉంటాయి. ఇవి నన్ను శక్తివంతంగా మలచడంతో పాటుగా రోజంతా ఆకలి దరి చేరకుండా కాపాడతాయి’’ అని అన్నారు.

ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌, యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ.. ‘‘ ఓ తల్లిగా, ఒకరికి ఏం కావాలన్నది నేను నిజంగా అర్ధం చేసుకోగలను. తల్లి, ఉద్యోగినిగా కెరీర్‌ నడపడమంటే ఎంతో కష్టపడాలి, ఓపిక కూడా కావాలి. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల కాస్త నిర్లక్ష్యం చూపడమూ కనిపిస్తుంది. ఈ మాతృదినోత్సవ వేళ, తల్లులందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యాయామాలు, ఆరోగ్యవంతమైన ఆహారం తినడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఫిట్‌నెస్‌ తరగతులలో చేరడం, రోజువారీ డైట్‌లో పండ్లు, బాదములను జోడించడం వల్ల అపరిమిత ప్రయోజనాలను పొందవచ్చు. మరో వైపు బాదములలో అత్యవసర పోషకాలు అయినటువటి ప్రోటీన్‌. కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ మొదలైనవి కూడా ఉంటాయి’’ అని అన్నారు.

సినీ, టెలివిజన్‌ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘మాతృత్వమంటేనే మీరెప్పుడూ మునివేళ్లపై ఉండాల్సి ఉంటుంది. దీనికోసం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నారిగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ కూడా ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన బాదములు తినేలా చూసేది. అది నాకు అలవాటుగా మారడంతో పాటుగా ఇప్పుడు తల్లిగా నేను కూడా అదే ఆచరిస్తున్నాను. బాదములలో అత్యుత్తమ ప్రోటీన్‌, శక్తి ఉంది. నా డైట్‌లో వాటిని జోడించడం వల్ల నా పిల్లలతో కలిసి ఆడుకునేందుకు తగిన శక్తిని పొందగలుగుతున్నాను’’ అని అన్నారు.

కన్నడ నటి, సెలబ్రిటీ, ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘మా అమ్మ నాకు వెన్నుముకలా ఉండేవారు. నాకెప్పుడైనా సవాళ్లు ఎదురైతే అంటే నా పాఠశాల రోజులు లేదంటే ఇప్పుడు పరిశ్రమలో ఉన్న వేళలో కూడా ఆమె నాకు తోడ్పడేవారు. ఆమె త్యాగాలే నేడు నేను ఇలా ఉండటానికి తోడ్పడ్డాయి. ఇప్పుడు ఆమె ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాద్యత నాది. ఆమె ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవనశైలిని అనుభవించేలా జాగ్రత్త పడాలి. ఆమె డైట్‌లో ఓ గుప్పెడు బాదములను భాగంగా చేయడం దానిలో ఓ అడుగు.బాదములు లాంటి గింజలలో ప్రొటీన్‌, కాల్షియం, విటమిన్‌ ఈ, ఇతర అత్యవసర పోషకాలు ఉంటాయి. ఇవి వైవిధ్యమైన నట్స్‌. వీటిని అలాగే లేదంటే రోస్ట్‌ చేసి లేదా సాల్ట్‌ జోడించి తీసుకోవచ్చు. ఇంటిలో అందుబాటులో ఉండే అత్యుత్తమ స్నాక్‌గా బాదములు నిలుస్తాయి’’ అని అన్నారు.

 Healthy Health benefits of Almonds

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News